గానం - అప్పాల ప్రసాద్ గారు
సంగీతం - రాజా
అపర శివా ఛత్రపతి హే శివాజీ రాజా
విపుల హిందు రాజ్య ప్రతిష్ఠాపక హే రవి తేజా
జై శివాజి రాజా జై శివాజి రాజా || అపర శివా ||
1. విశృంఖల మ్ళేచ్చపాద తాడనాన కృంగిన మహి
హిమ శృంగమునొక్కమారు ఊపి పైకి లేపినావు
విధర్మీయ వికృతిచే వికలమైన హృదయాలలో
స్వధర్మము స్వాభిమాన జ్వాలను పురికొల్పినావు || అపర శివా ||
2. ధన్యయయ్యె జిజామాత ధర్మ రక్షకుని మాతై
ధన్యుడయ్యె షహజీ ప్రభు యోధపుంగవుని పితయై
ధన్యమయ్యె నవభారతి నిన్ను గన్న మహియై
ధన్యమయ్యె హిందు జాతి మహనీయత కలదై || అపర శివా ||
3.సకల సుగుణ శోభితుడవు సుసంఘటన దక్షుండవు
మావళీల మాధవులుగ మార్చినట్టి జేత నీవు
అరివీర భయంకరుడవు ఆర్తుల ఆశాజ్యోతివి
వైరి గుండెలను చీల్చిన వీరాగ్రేసరుడవు || అపర శివా ||
4. నీ జీవన సందేశము నింగినేల వ్యాపింపగ
మా జీవన సర్వస్వము మాతృదేవి కర్పింపగ
హిందుత్వపు ఛాయలోన విశ్వమెల్ల నడిపింపగ
దీక్ష బూనినాము శివా దీవెనలందీయుమా || అపర శివా ||
Chatrapati Shivaji Songs in Telugu | Appala Prasadji Songs in Telugu | Chatrapathi Shivaji Songs | Patriotic Songs in Telugu | Akhanda Bharath Songs
0 Comments