Breaking News

6/recent/ticker-posts

సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత చరిత్ర - Sarvepalli Radhakrishnan Life Story in Telugu


 

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రదర్శించిన ప్రతిభా సామర్థ్యాలు అనితర సాధ్యం . ఒక సాదాసీదా కుటుంబంలో జన్మించి, పాఠశాలలో ఉపాధ్యాయుడిగా జీవితం ఆరంభించి, దేశంలోని అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠం అధిష్ఠించిన వ్యక్తి. ఆయన జన్మించిన సెప్టెంబర్ 5ను జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

అంత సాధించినా తాను అదృష్ట జాతకుడిననే రాధాకృష్ణన్ చెప్పుకునేవారు. తనని ఏదో తెలియని శక్తి నడిపిస్తున్నదని, తాను రాయటం మొదలు పెడితే ఆ కలం అలా రాసుకుంటూ పోతుంటుందని, ఆలోచనలు అలా వస్తాయని చెప్పేవారు. ప్రపంచంలో మహాతత్వవేత్తగా అందరూ గుర్తించినా రాధాకృష్ణన్ మాత్రం అది దైవకృపగానే భావించేవారు.

 

వేలూరు, చెన్నపట్నంలలో విద్యాభ్యాసం ముగించారు. విద్యార్థిదశలోనే పుస్తకాలు రాయటం మొదలు పెట్టారు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేసేటపుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇచ్చే లెక్చర్ వినటానికి ఇతర క్లాసుల వారు వచ్చి కూర్చునేవారు. . రాధాకృష్ణన్ అనంతపూర్, రాజమండ్రి కళాశాలల్లో కూడా కొంతకాలం పనిచేశారు. 1916లో మైసూరు విశ్వవిద్యాలయం ప్రారంభించినపుడు రాధాకృష్ణన్ని ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా ఆహ్వానించారు. అక్కడినుండి కలకత్తా యూనివర్సిటీకి వెళ్ళారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రారంభించిన మరుసటి సంవత్సరమే రాధాకృష్ణన్ కి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. నాటినుండి ఆయనకు ప్రపంచంలోని వంద విశ్వవిద్యాలయాలకు పైగా గౌరవ డాక్టరేట్స్ ఇచ్చాయి.

 

1931లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్ లర్ అయ్యారు. ఆంధ్రమహాసభకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి నైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. యు.జి.సి. ఛైర్మన్‌గా, యునెస్కో చైర్మన్‌గా, సోవి యట్ యూనియన్‌లో భారత రాయబారిగా, భారతదేశ ఉపరాష్ట్రపతిగా పది సంవత్సరాలు, రాష్ట్రపతిగా ఐదు సంవత్సరాలు పనిచేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా పనిచేసే సమయంలో రాధాకృష్ణన్ మతాలపై ఇచ్చిన తులనాత్మక ప్రసంగాలు ఇంగ్లండ్లోని ప్రముఖులందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ రచయితగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసిన తత్వశాస్త్ర గ్రంథాలు ప్రపంచమంతా విరివిగా అమ్ముడయ్యేవి. వాటిలో 'పాశ్చాత్యులు-పాశ్చాత్యుల దృక్పథం' అనే పుస్తకం విశేష ప్రచారం పొందింది. 1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు రాజ్యాంగసభలో తొలిగా జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగించి, ఆ తరువాత ప్రమాణ స్వీకార ముహూర్తంవరకు ప్రసంగించి అందరినీ ఆకట్టుకునే బాధ్యత రాధాకృష్ణన్ భుజాలమీద పెట్టారు.

 
స్వతంత్రభారతదేశంలో ఉన్నత విద్యావిధానం రూపకల్పన చేసింది రాధాకృష్ణనే. యు.జి.సి.కి ఛైర్మన్‌గా వ్యవహరించారు. స్వాతం త్ర్యం రాగానే సోవియట్ యూనియన్‌కి తొలి రాయ బారిగా రాధాకృష్ణన్ నియమించబడ్డారు. భారతదేశం రిపబ్లిక్ గా అవతరించగానే తొలి ఉపరాష్ట్రపతిగా, రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. 1957లో రెండవసారి ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారు. ఆ తరు వాత రాష్ట్రపతిగా 1962లో ఎన్నికయ్యారు. తలపాగా, పంచె,విశాల మైన నుదురు, తీర్చిదిద్ది నట్టుగా ఉండే ముక్కు, కాంతులిడే కళ్ళు, కంచు కంఠంతో రాధాకృష్ణన్ ఎంతో ప్రత్యేకంగా కనిపించేవారు. 1962లో రాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్ 1967లో తన పదవీకాలం ముగించాల్సివుంది. 1966 సంవత్సరంలోనే తదుపరి రాష్ట్రపతి ఎవరనే దాని మీద చర్చ మొదలైంది. వేరెవరినో రాష్ట్రపతిగా వెతకనక్కర లేదని రాధా కృష్ణన్ నే మరోసారి రాష్ట్రపతిగా ఎన్నుకోవటం బాగుంటుందన్న సూచనలు మొదలయ్యాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ కి ముందు రాష్ట్రపతిగా ఉన్న బాబూ రాజేంద్రప్రసాద్ రెండుసార్లు ఆ పదవికి ఎన్ను కున్నారు. కాబట్టి అదే సాంప్రదాయం కొనసాగించాలి అన్నది చాలామంది అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖులు, కమ్యూనిస్టుపార్టీ నాయకుడు హిరేన్ ముఖర్జీ, రాజకీయాలకు అతీతంగా ఉండే జయప్రకాష్ నారాయణవంటి వారంతా రాధా కృష్ణన్ అభ్యర్థిత్వంపట్ల మక్కువ ప్రకటించారు. ఆయనవంటి నిస్వార్థ నాయకుడిని మరొకరిని ఊహించలేమన్నది అందరిమాట. రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ తన మిత్రుడు జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ చేత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయించారు. 1967లో తన పదవీకాలం ముగియగానే నేరుగా మద్రాసులోని మైలాపూర్‌లో ఉన్న సొంత ఇల్లు 'గిరిజు'ను చేరారు.
 
అనేక దశాబ్దాలుగా పలురకాల బాధ్యతలతో క్షణం తీరికలేని జీవితం గడిపిన రాధాకృష్ణన్ కి హఠా త్తుగా ఎక్కడలేని తీరిక లభించింది.. ఆయనకు ఎంతో ఇష్టమైన పుస్తకపఠనం, రచనల్లో జీవితం గడపదలచుకున్నారు. 1969 గాంధీజీ శత జయంతి. ఆ సందర్భంగా దేశంలో ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు. అందులో ఒకటైన 'గాంధీ 100 సంవత్సరాలు' సంకలనానికి బాధ్యతను రాధాకృష్ణన్ స్వీకరించారు. ఆయనకు హిందూమతంమీద విశేష అభిమానమేకాని పరమతద్వేషం లేదు. అందుకే క్రైస్తవుల సెయింట్ జాన్ సువార్తపై మహ త్తర గ్రంథానికి శ్రీకారం చుట్టారు. రాధాకృష్ణన్ ఇంటిని వదిలిరావటం తగ్గిపోయింది. 1968లో ఆయనకు రెండు బహుమతులు ప్రకటించారు. ఒకటి భారతీయ విద్యాభవనావారివి, మరొకటి సాహిత్య అకాడమీ- ఆ రెండు అవార్లు అందుకునేం దుకు ఆయన వెళ్ళలేని పరిస్థితి. ఇంటికి వచ్చి వారే అవార్డులను రాధాకృష్ణన్ అందించారు. రాధాకృష్ణ మానసికంగా ఇబ్బందిపడే సంఘటనలు వరుసగా జరిగాయి. ఆయనకెంతో ఆత్మీయు లైన రాజగోపాలాచారి, టి.టి.కృష్ణమా చారి, మోహనకుమారమంగళం వంటివారు ఒకరి తర్వాత మరొకరు మరణించారు. వారి మరణవార్తలు ఆయనకు చేరినప్పుడల్లా ఏదో తెలియని అలజడి. మద్రాసులో అంతా ఆయన బంధుగణమే అయినా రాధాకృష్ణన్ కి ఏదో తెలియని ఒంటరితనం. ఆయన ముగ్గురు అల్లుళ్ళు ఆయన కళ్ళముందే వెళ్ళిపోయారు. అది ఆయన మనసును పిండేసే విషయమే.
 
క్రమంగా శారీరక ఆరోగ్యం తగ్గ టం మొదలెట్టింది. శరీరంలోని మాంసమంతా కరిగి పోయిందా అన్నట్టుగా తయారయ్యారు. క్రమక్రమంగా జ్ఞాపకశక్తి పోతున్నది. వచ్చినవారిని గుర్తుపట్టటం కష్టమవుతున్నది. ఇటువంటి స్థితిలో రాధాకృష్ణన్ తుంటిఎముక విరి గింది. ఇక పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. జ్ఞాపకశక్తి పూర్తిగా పోయింది. ఎముకల గూడులా తయారైమంచంలో కదలక మెదలక పడివుండేవారు. కూతుళ్ళు, మనుమలు ఎంతమంది తిరుగుతున్నా ఎవరినీ ఆయన తెలుసుకునే పరిస్థితి లేదు. దాదాపు సంవత్సరన్నరపాటు ఆయన అలా మంచంలో ఉండిపోయారు. మేథోసంపత్తి ఆయన ఆస్తి. ఇప్పుడసలు జ్ఞాపకశక్తి లేదు. ఆయన ప్రపంచ ప్రతిష్టాత్మకమైన 'టెంపుల్ టన్' అవార్డ్ ప్రకటించారు. కాని ఆ విషయంచెప్పినా గ్రహించలేని పరిస్థితి. వేదాంత విజ్ఞానంతో ప్రపంచానికి ఒక కొత్త మార్గం చూపించిన ఆ మహానుభావుడు చివరికి తన 86వ ఏట 1975 ఏప్రిల్ 17న కాలధర్మం చెందారు. 
 
జాతిని తీర్చిదిద్దుతున్నగురువులందరికీ 
"ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు"...
సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు | సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత చరిత్ర | సర్వేపల్లి రాధాకృష్ణన్ వ్యాసం | సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి | సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి | సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత చరిత్ర PDF | సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి | సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి | ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు | సర్వేపల్లి రాధాకృష్ణన్ వ్యాసాలు | Sarvepalli Radhakrishnan Life Story in Telugu | Sarvepalli Radhakrishnan Biography in Telugu | Sarvepalli Radhakrishnan Essay in Telugu for School Project | Sarvepalli Radhakrishna Life Story in Telugu | Sarvepalli Radhakrishna Quotes in Telugu | Happy Teachers Day wishes in Telugu | Happy Teachers Day Quotes in Telugu
- విశ్వ గురు భారత్.

Post a Comment

0 Comments