Breaking News

6/recent/ticker-posts

మాహాత్మ గాంధీ జీవిత చరిత్ర - Mahatma Gandhi Life Story in Telugu

 జననం - 2 అక్టోబర్ 1869
మరణం - 30 జనవరి 1948

గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఈయన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్ లో జన్మించారు. తల్లి పుతిలిబాయి, తండ్రి కరంచంద్. గాంధీ రాజ్ కోట్ లో పాటశాల విద్య పూర్తి చేసారు. చిన్నతనంలో చూసిన "సత్య హరిశ్చంద్ర", "శ్రవణ కుమార" నాటకాలు అతనిపై ఎంతో ప్రభావం చూపాయి. భావనగర్ లో ఉన్నత విద్యను అభ్యసించి,బారిస్టర్ చదవడానికి ఇంగ్లాడు వెళ్ళారు. ఇంగ్లాడు నుంచి తిరిగి వచ్చిన తరువాత బొంబాయిలో న్యాయవాద వృత్తి చేపట్టారు.
వృత్తిలో భాగంగా గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్లాడు. ఒకనాడు ఒకటో తరగతి టికెట్టుకొని రైలులో ప్రయాణిస్తుండగా, ఆంగ్లేయులు, నల్ల జాతీయుడనే ద్వేషంతో అవమానించి రైలునుండి దింపి వేశారు. ఆ అవమానాన్ని భరించలేక నల్లవారందరినీ కూడగట్టి సత్యాగ్రహం చేశారు. అక్కడి ప్రజలలో రాజకీయ, సామాజిక స్పృహ కల్పించారు.
స్వదేశానికి తిరిగి వచ్చాక ఇక్కడి పరిస్థితులను గమనించిన గాంధీ స్వాతంత్ర్య సాధనకై నాటి ప్రముఖ స్వాతంత్ర యోధులైన గోఖలే, తిలక్, మొదలైనవారితో ఉద్యమం ఆరంభించారు. సహాయ నిరాకరణం, విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు నిర్వహించి ఎన్నోమార్లు జైలుకు వెళ్లారు.
గాంధీజీకి చిన్నతనంలోనే కస్తూరి బాయిలో వివాహం జరిగింది. ఆమె కూడా ఆయనకు అన్ని విధాలా సహకరించింది. 1944లో భార్యావియోగం జరిగినప్పటికీ గాంధీజీ స్వాతంత్రోద్యమాన్ని విడువలేదు. దేశ స్వాతంత్ర్యంకోసమే జీవితాన్ని వెచ్చించారాయన.
గాంధీజీ నడిపిన అహింసా పోరాటం ఫలితంగానే 1947 ఆగస్టు 15న భారత్ కు స్వాతంత్ర్యం లభించింది. దేశ స్వాతంత్ర్యానికి అహర్నిశలు కృషిచేసిన గాంధీజీ, ప్రార్థనా మందిరంలో ఉన్న సమయంలో నాథూరాం గాడ్సే ఆయనను తుపాకితో కాల్చిచంపాడు. అది 1948 జనవరి 30వ తేదీ.
గాంధీజీ స్థాపించిన సబర్మతీ ఆశ్రమం, వార్ధా ఆశ్రమం, ఆయన ఆశయాలకు ప్రతిరూపాలు. గాంధీజీ నిరాడంబరుడు, వృత్తి విద్యలను ప్రోత్స హించాడు. సత్యం, అహింస, శాంతి ఉత్తమ మార్గాలని దృఢంగా నమ్మి ఆచరించిన మహనీయుడు. గాంధీజీ జాతిపితగా, మహాత్ముడిగా శాశ్వతంగా భారతీయుల హృదయాల్లో నిలిచే ఉంటారు.
Mahatma Gandhi Life Story in Telugu | Mahatma Gandhi Biography in Telugu | Mohandas Karamchand Gandhi Life Story in Telugu | Mohandas Karamchand Gandhi Biography in Telugu | మాహాత్మ గాంధీ జీవిత చరిత్ర | Viswa Guru Bharath | విశ్వ గురు భారత్ | మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జీవిత చరిత్ర | About Mahatma Gandhi in Telugu | About Mohandas Karamchand Gandhi in Telugu | Telugu Essay on Mahatma Gandhi | మహాత్మాగాంధీ జీవిత చరిత్ర | మాహాత్మగాంధీ వ్యాసం | తెలుగు వ్యాసాలు | Telugu Essays on Mahatma Gandhi | Mahatma Gandhi telugu Essay | Mahatma Gandhi Telugu Essay for Project | About Mahatma Gandhi Essay in Telugu | Mahatma Gandhi History in Telugu | Mahatma Gandhi in Telugu | Mahatma Gandhi Life in Telugu | Mahatma Gandhi Jeevitha Charitra Telugulo | Mahatma Gandhi Gurinchi Matter in Telugu | Mahatma Gandhi Gurinchi Vakyalu Telugulo | Mahatma Gandhi Principles in Telugu | Mahatma Gandhi Speech in Telugu | Telugu Project for School Students | Mahatma Gandhi | మహాత్మాగాంధీ

Post a Comment

1 Comments