బాలలము మేము మేము బాలలము
భారతమాత గళమున విరిసిన మాలలము మేము
పుల మాలలము మేము || బాలలము మేము ||
సత్యం ధర్మం శాంతి అహింసలే మా మార్గం
వినయ విధేయత సంస్కారాలే మా ధ్యేయం
సత్యం ధర్మం శాంతి అహింసలే మా మార్గం
వినయ విధేయత సంస్కారాలే మా ధ్యేయం || బాలలము మేము ||
గాంధీ నెహ్రు నేతాజీలే మా గురువులు
దేశభక్తిని భోదించేవే మా చదువులూ
గాంధీ నెహ్రు నేతాజీలే మా గురువులు
దేశభక్తిని భోదించేవే మా చదువులూ || బాలలము మేము ||
కులములమతములకూ దూరంగా పయనిద్దాం
మనమంతా ఒక్కటిగానే నివసిద్దాం
కులములమతములకూ దూరంగా పయనిద్దాం
మనమంతా ఒక్కటిగానే నివసిద్దాం || బాలలము మేము ||
బీద గొప్ప బేధం లేక బ్రతికేద్దాం
నీది నాదని తేడా లేదని చాటేద్దాం
బీద గొప్ప బేధం లేక బ్రతికేద్దాం
నీది నాదని తేడా లేదని చాటేద్దాం || బాలలము మేము ||
0 Comments