ఒక ఊరిలోకి ఒక మహర్షి వచ్చారు. ఆ ఊరివాళ్ళు ఎవరూ ఆయన్ని పట్టించుకోలేదని, సరిగా ఆదరించలేదని ఆగ్రహం చెందిన ఆయన ఈ ఊరిలో 50 ఏళ్ళు వర్షం పడదని శాపం పెట్టేసాడు.
ఆ విషయం తెలుసుకున్న ఊరివాళ్లంతా మునిని వచ్చి వేడుకున్నారు. శాపానికి విమోచనం లేదని అనుభవించక తప్పదని చెప్పారు.
"వర్షం కురవాలంటే ఆ పరంధాముడు శంఖం ఊదాలి ..."
అంతమందిలో ఒక్కడికి ఎందుకో నమ్మకం. ప్రతిరోజు భూమిని దున్నడానికి వెళ్ళేవాడు.
అతడిని ఆపి ఊరివాళ్ళు ప్రశ్నించారు. 50 ఏళ్ళు వర్షం పడదని తెలిసి ఎందుకు దున్నడం అని. అందుకు ఆ వ్యక్తి 50 ఏళ్ళ తరువాత దున్నడం మరిచిపోతానేమో. రోజు అలవాటు అయిన పని అని అన్నాడు .
భూమి సారవంతం కోల్పోవచ్చు మళ్ళీ పంట పండించాలంటే నేల బావుండాలి కదా అన్నాడు. ఈ మాట ఆ పరంధాముడికి వినిపించింది. "50 ఏళ్ళు శంఖం ఉదకపోతే ఎక్కడ ఊదడం మరిచిపోతానో అని అనుకున్నాడు వెంటనే శంఖం పట్టి ఊదాడు".
వర్షం హోరుగా ఈ నేలమ్మను తాకింది. నమ్మకం మనిషిని బతికిస్తుంది. భగవంతుడిని కూడా మార్చేస్తుంది.
సర్వే జనా సుఖినోభవంతు
ధర్మో రక్షతి రక్షితః
0 Comments