Breaking News

6/recent/ticker-posts

జగదభిరామా వందనము

దివ్య ప్రభలూ వెలిగేనమ్మా
నా రాముని ఎదుట.. 
కన్నులారా గాంచావమ్మా అన్నీ తానని దలచి.. 

పంచ శత వర్ష నిరీక్షణ ఫలించేనిది  భాగ్యమే..
అయోధ్య పురమందు నా అందాల రామునెదుట వెలిగెనమ్మా సందెవేళా.. 
చూడరండీ.. వైభవమూ..
తరియించరండీ.. ఇహ పరమ్ముల.. 

రాముడూ నా రాముడూ.. 
సుగుణ సుందర రూపుడూ..
అనుబంధగంధాల ఆత్మారాముడు.. 
ధర్మమూర్తీ మరల ధరకు దిగివచ్చినిదె గాంచరే.. 

వందనాలో రామా.. నీకు.. 
స్వాగతము శ్రీరామా నీకు.. 
కరుణాలవాల.. కామితార్ద ప్రధా 
 వందనము ఘన భక్తపోషక.. 
జగదభిరామా వందనము.
- విత్రయ శర్మ
(9603856152)

Post a Comment

0 Comments