Breaking News

6/recent/ticker-posts

దేశం కోసం జీవిద్దాం - Desam Kosam Jeeviddam Song Lyrics in Telugu

రచన - వేణు గోపాల్ గారు
సంగీతం - రవి కళ్యాణ్ గారు


దేశం కోసం జీవిద్దాం - దేశం కోసం జీవిద్దాం
దేశం కోసం జీవిద్దాం - మన దేశం కోసం జీవిద్దాం
మనం మనం మహాగణం - మహాగణమ్మే ప్రభంజనం

నేనోక్కడినని అనుకుంటే - నేతాజీ ఎట్లగుదువోయి
శివమెత్తక నువు కూర్చుంటే - శివాజీ ఎట్లగుదువోయి
చీమల గుంపును గమనిద్దాం - పక్షుల పయనం పరికిద్దాం
నీటిన నిప్పును రగిలిద్దాం - నింగిన చుక్కల శాసిద్దాం
చరిత్రలోని మహాపురుషులను - ప్రతినిత్యమ్ముస్మరించుదాం ||మనం మనం||

ఇది భూతల స్వర్గమ్మేలే - ఇక్కడ అందరు బంధువులే
మనమూ మనదంటే సరిలే - కాదంటే ఇక కుదరదులే
ఇంటిదొంగలను గమనిద్దాం - ఇజాలనిజాల ఛేదిద్దాం
రక్కసి మూకల గుర్తిద్దాం - రామ బాణమును సందిద్దాం
చరిత్ర నేర్పిన గుణపాఠాలను - ప్రతినిత్యమ్ము పఠించుదాం ||మనం మనం||

ఈ మట్టిన పుట్టిన కుందేలే - వేట కుక్కలను తరిమెనులే
ఈ చెట్టున ఆడిన ఆ ఉడతే - సేతు బంధనం చేసెనులే
జఠాయువయ్యి జన్మిద్దాం - జన్మ సార్ధకంబొనరిద్దాం
తను మన ధనములనర్పిద్దాం - తల్లి భారతిని సేవిద్దాం
పరంపరాగత చరిత్రలోని - పరమార్ధమ్మును గ్రహించుదాం ||మనం మనం||
Happy Independence Day wishes in Telugu | Independence Day songs in telugu | Happy Independence Day Songs in Telugu | Happy Independence Day Greetings in Telugu | Independence Day Songs | Republic Day Songs in Telugu | Happy Republic Day wishes in telugu | republic day greetings in telugu | patriotic songs in telugu | latest patriotic songs in telugu | desha bhakti geetalu | akhanda bharath songs | viswa guru bharath telugu

Post a Comment

0 Comments