Breaking News

6/recent/ticker-posts

ఈ అనంతవాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం - Ee Ananta Vahiniga Pravahinche Song Lyrics in Telugu


ఈ అనంతవాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం
లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం

దేహమనే ప్రమిదలో దీపం వెలిగించుదాం
    జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం
ఇవ్వడమేలే మన జాతి లక్షణం
      ఫలములిచ్చుటేగానీ కోరదు ఫలితం
ఎన్నియుగాలైనగానీ మారనిది ఈ గుణం
     ఎంతైనా మనమంతా తీర్చాలి ఈ ఋణం

కాలికి గాయమ్మైతే కంటిచుక్క రాలదా
   కలబోసిన మనసులన్ని కష్టం కరిగించవా
కలసి బతకడం మన ధర్మం మర్మం
హరివిల్లుకు పురుడోసిన పుడమి ఈ పూలవనం
వేష,భాష,భూషణాలు వేరువేరు పంథాలు
    మన జననీ భరతమాత మందిరాన తోరణాలు

ఉడతకున్న భక్తి అంటే ఉన్నదంత ఇవ్వడం
    తనదేది కాదంటూ సర్వం అర్పించడం
సమర్పణమ్ములే మన జీవిత సూత్రం
     సమిధలైతేనే వ్యాపించు సుగంధం
మానవ కళ్యాణముకై మునులవోలె బతుకుదాం
   ఆజీవన పర్యంతం అమ్మను పూజించుదాం




Post a Comment

0 Comments