రచన, గానం - అప్పాల ప్రసాద్ గారు
సంగీతం - రాజా
కార్యకర్త సాధనం - ధ్యేయ పూర్తి కంకితం
తనకు తానే దీపమై - మాతృ భూమికర్పితంll
1. నర నరాన నా దేశపు పూర్వజులే ప్రేరణ
నలువైపుల సంఘ కార్య విస్తరణే సాధన
అహంకార రహితమైన ఆత్మార్పణ జీవనం
నిర్ మమత్వ భావన మనదీశ్వరీయ కార్యము!!
2. హిందు రాష్ట్ర సిద్దాంతం సత్యం,సనాతనం
కఠినమైన లక్ష్యమ్మిది ,విజయం సునిశ్చయం
సరళమైన,సహజమైన సంఘ శాఖ మన బలం
స్థిర చిత్తంతో నిరతం పని చేస్తేనే ఫలితం!!
3.ప్రలోభాలు,భయాలకు విచలితులం కావద్దు
ప్రతి బద్దత,విశ్వాసం జార విడుచుకోవద్దు
మధురమైన మాటలతో,ఆదర్శపు చేతలతో
వ్యక్తి వ్యక్తి నిర్మాణం - సంఘటనకు మూల బలం
0 Comments