Breaking News

6/recent/ticker-posts

ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధకా - Prayatname Svayatnamai Daivamanchu Saadhaka Song Lyrics in telugu

ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధకా
ఇదే ధ్యాస పదే పదే మనసునందు నిలుపరా ||

1.ధ్యేయ మార్గమందునా - ధృవుని వోలే నుండుమా
సాధనా పథమ్ములో- సతతమ్ము నిలువుమా 
ఆగకుండ ఆగకుండ - నడువు ముందు ముందుకు
ధ్యేయ దీప కాంతిలో - సాగి పొమ్ము ముందుకు  || ప్రయత్నమే||
2. తోడు రాకపోయినా - నీడ లేకపోయినా 
దారి చుట్టు చీకటి - దట్టముగా నిండినా 
గట్టి గుండె బలముతో - పట్టు వదలి పెట్టకు
ధ్యేయ దీప కాంతిలో - సాగి పొమ్ము ముందుకు  || ప్రయత్నమే||
3.మోహపాశములను త్రెంపి - స్వార్థమును జయింపుమా 
ధ్యేయమందు ఐక్యమంది - ధీరుడవై సాగుమా
వెనుకకు అడుగేయకుండ - నడువు ముందు ముందుకు
ధ్యేయ దీప కాంతిలో - సాగి పొమ్ము ముందుకు  || ప్రయత్నమే||
4. పర్వతాలు సాగరాలు - పెను తుఫానులడ్డినా
ప్రళయ ఝంఝలెన్ని లేచి - పైకి పైకి వచ్చినా
ఎదురు తిరిగి పైకి దూకి - కదలి పొమ్ము ముందుకు
ధ్యేయ దీప కాంతిలో - సాగి పొమ్ము ముందుకు  || ప్రయత్నమే||

గానం - అప్పాల ప్రసాద్ గారు
సంగీతం - రాజా

Post a Comment

0 Comments