రామయ్య రామయ్య రావయ్యో
మన దేశపుతీరుజూడ రావయ్యో ||2||
1.వాడల్లో నీగుడి వుంది - గూడెంలో నీగుడి వుంది
పల్లెల్లో నీగుడి వుంది - పట్నంలో నీగుడి వుంది
పేట పేటల్లో నుంది - సందు గొందుల్లో నుంది
|| నువుబుట్టిన అయోధ్యలో - నీగుడియే కరువయ్యింది || రామయ్య ||
2.బాపూజీ రాసిన జాబు - పదిలంగా దాచేటోళ్ళు
అక్బరు వాడిన కత్తి - నెత్తిన మోసేటోళ్ళూ
షాజాను ప్రేమ సమాధి - భద్రంగా చూసేటోళ్ళు
|| నువుకట్టిన రామసేతు - కూల్చంగ చూస్తున్నరు || రామయ్య ||
3.శ్రీరామ నవమి నాడు - మామంత్రి గారిని చూడు
పట్టూ బట్టలు గట్టి - మంచి ముత్యాలు పట్టీ
భద్రాద్రికి విచ్చేస్తాడు - నీపెళ్ళిని జరిపేస్తాడు
|| శ్రీరాముని మందిరమంటే - మతతత్వమంటుంటాడు || రామయ్య ||
4.రావయ్య దశరధ రామ - రావయ్య సీతారామ
మారీచులు మళ్ళొచ్చారు - రావణులే పుడుతున్నరు
తాటకినే చంపినట్టు - కోదండం మళ్ళీ పట్టు
|| నీబాణం ఎక్కుపెట్టి - రాకాసుల తరిమి కొట్టూ || రామయ్య ||
0 Comments