రచన - హనుమత్ ప్రసాద్ గారు
గానం - అప్పాల ప్రసాద్ గారు
సంగీతం - రాజా
శివరాయ శివరాయ నీకు దండము
శివమెత్తి ఆడెదము మేమందరం || శివరాయ ||
1. జీజామాత నీకు కథ లెన్నో చెప్పెనంట
రామాయణ భారతాల నీతులు పలికించెనంట
వీరమాత అయ్యి నిన్ను వీరునిగా మలచెనంట
దాదాజీ ఖొండ దేవ్ అండ నీకు బలమంట || శివరాయ ||
2. విదేశీయ ప్రభువు వద్ద తండ్రి కొలువున్నగాని
స్వదేశీయ స్వాతంత్య్రం సాధించగ నెంచినావు
పదమూడేళ్ల ప్రాయం లో కత్తి చేతిన పట్టి
కదం త్రొక్కి పదం పాడి తోరణమును గెల్చినావు || శివరాయ ||
3. అడవుల్లో తిరిగినావు కొండలెన్నొ ఎక్కినావు
మావళీల సావాసం మంచిగాను చేసినావు
కొండ పిండి చేయునట్టి వీరులుగా మలచినావు
శత్రుగుండె చీల్చునట్టి రోషంబును నింపినావు || శివరాయ ||
4. విదేశీయ విద్రోహుల విచ్చుకత్తి నెరజేసి
విసుగు విశ్రాంతి వీడి యుద్దాలే జేసినావు
హిందువులను కాచి హిందు సామ్రాజ్యం స్థాపించి
రాజ్యమంత గురువు రామదాసునకే ఒసగినావు || శివరాయ ||
0 Comments