ప్రదర్శకులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో పార్ధసారధి అనే యువకుడి నెలకొరిగాడు. అతని దగ్గరకు వెళ్లడానికి ఎవరికి ధైర్యం చాలలేదు. ఎందుకంటే ముందుకు వస్తే కాల్చేస్తామని పోలీసులు తుపాకు ఎక్కుపెట్టారు. ‘‘ముందు నన్ను కాల్చి తరువాత వీరిని కాల్చండి’’ అంటూ ప్రకాశం పంతులు ముందుకు నడిచారు. ఇది చూసిన పోలీసులు నిర్ఘాంతపోయి వెనక్కు తగ్గారు. ప్రజలంతా ‘ఆంధ్రకేసరికి జై’ అంటూ నినాదాలు చేశారు.
1921 సహాయనిరాకరణోద్యమంలో హైకోర్ట్ లాయర్ ప్రాక్టీసును వదిలిపెట్టారు. అప్పటికి ఆయన నెలకు 6వేల రూపాయలు సంపాదించే వారు. వివిధ నగరాల్లో పెద్దపెద్ద భవంతులు ఉండేవి. మూడు లక్షల రూపాయలు ఉండేవి. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న తరువాత అవన్నీ కరిగిపోయి చివరికి ఎవరైనా టిక్కెట్టు కొనిస్తే రైలులో ప్రయాణం చేసే పరిస్థితి వచ్చింది. అందుకు ఆయన ఎప్పుడు బాధపడలేదు. ప్రజల నుంచి సంపాదించాను. ప్రజల కోసమే ఖర్చు చేశాను అనేవారు. ప్రజలను ప్రేమించనివాడు దేశభక్తుడు కాదు, కాలేడు అని అన్నారు. మహాభారతంలో ఉన్న రాజనీతి మరెక్కడా లేదు. అసలు ఉద్యోగపర్వం చదవని వాడు రాజకీయాల్లోకి రాకూడదని టంగుటూరి ప్రకాశం పంతులు దృఢమైన అభిప్రాయం.
0 Comments