Breaking News

6/recent/ticker-posts

వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు - Veerudu Nagadheerudu Shivaji Song Lyrics in Telugu


వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు
సమరాంగణమే గెల్వగ సంకల్పించిన ఘనుడు

1. ఢమ్ ఢమ్మను శబ్దాలతొ నగారాలు మారుమ్రోగె
గజ రాజులు తొండమెత్తె, ఘీంకారాల్ మిన్నుముట్టె
శివ సైనిక పదఘట్టనతో దిక్కులు పిక్కటిల్లె
వీరరసం ఉద్భవించే నదీ నదాలుప్పొంగెను   || వీరుడు ||

2. హాహాకారాలతో కోలాహలమావరించె
మదగజాలు వృక్షాలను కూకటి వ్రేళ్ళతో కూల్చెను
సైనికుల పాదధూళి సూర్యకాంతి క్రమ్మి వేసే
చీకటియే ఆవరించి నక్షత్రాలగుపించెను
అశ్వ నౌక ఫిరంగీల పదాతి చతురంగబలం
కదలిరాగ వేగంగా కంపించెను భూగోళం    || వీరుడు ||

3. ఎగురుతున్న ధర్మద్వజం చేతబూని సైన్యదళం
గంటలన్ని ఘల్లుమనె శత్రుగుండె గుభిల్లనే
రాజులు మహరాజులంత ఒక్క క్షణం నిలువలేక
హర హర మహదేవ యంటు శివాజీని అనుసరించె
ఫణవ శంఖ భేరీలతో ప్రతిధ్వనించె కొండకోన
భయభ్రాంతులతొ జనము అటూ ఇటూ పరుగులెత్తె    || వీరుడు ||

4. శత్రుసేన మదగజాల కుంభస్థలి బ్రద్దలయ్యె
శత్రు శిబిర గుడారాల్లొ కాలరాత్రి నాట్య మాడె
తాబెల్ వీపుల చిప్పలు ధన్ ధన్నని పగిలిపొయే
పడగెత్తిన కోడెనాగు కోరలూడి కూలిపోయె
చెదరని బెదరని సైన్యం - సైనిక పథ సంచలనం
వీర శివా సైన్యానికి జై భవాని అభయ వరం    || వీరుడు ||

5. జంభునిపై ఇంద్రుడు,సంద్రముపై బడబాగ్ని, రావణుని మదమణమనచిన కోదండ రాముడై
మేఘంపై పవనుడు,మన్మథుపై శంకరుడు, వేయి చేతులె నరికిన క్రోధ పరశురాముడై
వృక్షాలపై అగ్నికణం,జింకలపై చిరుతగణం, ఏనుగుపై కుప్పించిన స్వయం మృగేందృడై
చీకటిపై వెలుగులా,కంసునిపై కృష్ణునిలా,రక్కసున్ని చీల్చెసిన ఉగ్ర నరసింహుడై
మ్ళేచ్ఛులైన మొఘలాయిల పీచమడచి ఛత్రపతి
శివరాజై హుంకరించె,శత్రువులను సంహరించె,సామ్రాజ్యం అధిష్టించె... 
|| వీరుడు ||


Post a Comment

0 Comments