Breaking News

6/recent/ticker-posts

గలగల జలజల పారే జీవనదులురా - Rally For Rivers Song Lyrics in Telugu

 జగ్గీ వాసుదేవ్ గారి 'నదుల రక్షణ' ఉద్యమానికి మద్దతునిద్దాం.

 


రచన - అప్పాలప్రసాద్ గారు

గానం, సంగీతం - జడల రమేష్ గారు



 
గలగల జలజల పారే జీవనదులురా
కాలుష్యపు కోరల్లో సొమ్మసిల్లెరా..
ప్రాణి కోటి మనుగడకు జీవనాడిరా
సిరులే పండించలేక మూగవోయెరా || గలగల ||
 
1. భూతల్లికి ఆభరణం - ప్రకృతి కే పచ్చదనం
నలువైపుల ప్రవహించి సౌరభాలు వెదజల్లెను
రసాయనపు వ్యర్థాలు, మురుగు చెత్త చెదారాలు- మన తప్పులతో తల్లి విలవిల్లాడుతు వుంది || గలగల ||
 
2. పంట చేల పరిపుష్టితో రైతే రాజుగ మారెను
సోయగాల కనువిందు తో కవిరాజే గళమెత్తెను
దుర్గంధం ముక్కుపుటాలదిరేలా చేరుతుంది
ఆహారపు దిగుబడులే అంతకంత దిగజారెను || గలగల ||
 
3.ఆధ్యాత్మిక నెలవాలం-ఆర్థికంగ సౌభాగ్యం
సకల జీవరాశులన్ని ఊపిరితో నడయాడెను
నీరు తగిలితే మొక్కలు మాడి మసై పోతుంటే
నీరు త్రాగి పశు పక్షులు ప్రాణాలే కోల్పోయెను || గలగల ||
 
4. గంగ,యమున,గోదారి,కృష్ణ ఎండిపోతోంది
ఎడారి యై మన భూమిలో కరువు తాండవిస్తుంది
ప్రమాద ఘంటికలే మ్రోగుతుంటె వినలేవా
నిజ నిజాలు నీ కన్నులతోనైనా కనలేవా|| గలగల ||
 
5. చెట్లు నరికి వేస్తుంటే - ఇసుక ఎత్తి పోస్తుంటే
పరివాహక ప్రాంతాలే ఆక్రమించి దోస్తుంటే
నదులపైన అడ్డగోలు ఆనకట్టలేస్తుంటే
విచక్షణా రహితంగా నది జలాలు తోడుతుంటే || గలగల ||

6.వరద ముప్పు తగ్గాలి కరువు నివారించాలి
భూమికోత అరికట్టి భూసారం పెంచాలి
భూగర్భ జలాలతో భూమి పొంగి పోవాలి
కళకళ లాడే జలాలు జీవుల పోషించాలి || గలగల ||
 
7.నదులకు ఇరువైపులా వృక్షాలే పెంచాలి
వృక్షాలాధారంగా వ్యవసాయం చేయాలి
తరతరాల వారసత్వ భారతీయ సంపదలై
జీవనదులు సవ్వడితో నిత్యం ప్రవహించాలి || గలగల ||

Post a Comment

0 Comments