Breaking News

6/recent/ticker-posts

సమర్థ రామదాసు జీవిత చరిత్ర - Samartha Ramdas Life Story in Telugu

ఛత్రపతి శివాజీ రాజగురువు సమర్థ రామదాసు. తమ యావత్ జీవితాన్ని రాజకీయంగా, సామాజికంగా దేశాన్ని సంఘటిత పరచటం కోసమే వినియోగించారు. దేశ పర్యటన చేసినప్పుడు సమాజం కడుదయనీయ పరిస్థితులలో ఉన్నదని గ్రహించి, బాధతో సమాజంలో ధైర్యసాహసాలను శీలాన్ని నింపాలని బలోపాననా మార్గాన్ని రూపొందించాలని ఆలోచించారు. దేశంలో నలుదిక్కుల పర్యటిస్తూ తామే ఆ పనిని చేపట్టారు. సాధు సంతులకు ఆ పని యొక్క ప్రాముఖ్యాన్ని వివరించారు. దేశానికి అవసరమైన అన్ని సద్గుణాలను ఛత్రపతి శివాజీ రూపంలో వారికి ప్రత్యక్షమయ్యాయి. సమాజాన్ని జాగృతం చేయాలనుకునేవారికి సమర్థ రామదాసు జీవిత చరిత్ర స్పూర్తినందిస్తుంది.
 
శక సంవత్సరం 1530లో శ్రీరామనవమి ఉత్సవ సమయంలో నారాయణుడు జన్మించాడు. ఆయన వేదాన్ని, వేదాంతాన్ని, భాగవతము, ఉపనిషత్తులు, భగవద్గీతల్ని బాగా అధ్యయనం చేశాడు. వీటి ఆధారంగానే ఆయన తనరచనల్ని కొనసాగించాడు. ఆ తర్వాత రాజకీయాల్లో సమయాన్ని వెచ్చించాడు. వేదాల్లో ప్రాయశ్చిత్తం మాత్రం వుందా? చచ్చిన వాన్ని బ్రతికించే మార్గం లేదా? అన్నాడు. ఆ చచ్చిన గ్రద్దను చేతిలోకి తీసుకొని రామనామం జపిస్తూ, చేతితో నిమిరాడు. ఆ గ్రద్ద ఆకాశంలోకి ఎగిరిపోయింది. ప్రాయశ్చిత్తాన్ని గురించిన ఆయన అభిప్రాయం సుస్పష్టమయింది.
 
తీర్థయాత్రలు నుండి తిరిగి వచ్చిన తర్వాత రామదాసు స్వామి తన భవిష్యత్ కార్యక్రమాలకు ప్రణాళికను రూపొందించాడు. తీర్థయాత్రల సమయంలో ప్రజల దీనస్థితిని పరిశీలించే అవకాశం ఆయనకు దొరికింది. కరువుకాటకాలవల్ల ప్రజల పరిస్థితి దయనీయంగా తయారయింది. రాజ్యాధికారం విధర్మీయులైన విదేశీయుల చేతిలో వుంది. దేవాలయాలు ధ్వంసం చేయబడుతున్నాయి. స్త్రీలపై అత్యాచారాలు మితిమీరిపోయినాయి. ప్రజలు బలవంతంగా మతం మార్చుకునే పరిస్థితులు సృష్టించ బడుతున్నాయి. పరయీ పరిస్థితుల్ని మార్చటానికి తన భవిష్యత్ కార్యక్రమాన్ని నిశ్చయించుకున్నాడు.
 

ఛత్రపతి శివాజీ ప్రతి గురువారం సమర్థ రామదాసు దర్శనానికి వెళ్లేవాడు. ఈ సమావేశంలో రాజకీయ పరిస్థితుల్ని గురించి చర్చించేవారు.
 
సమర్థ రామదాసు కృషి ఫలితంగా ఆనాటి ముసల్మాన్‌ ఆచారం ప్రకారంగా 'జోహార్' అను మాటకు బదులుగా, 'రాం,రాం' అని ప్రకారంగా జోవాచారం మొదలైంది.
 
 
సమర్థ రామదాసు శివాజీకి ఒక ఉత్తరం పంపాడు. అందులో యిలా వ్రాసి వుంది: “రాజా! తీర్థయాత్రలో ఉత్తర, దక్షిణ భారతాలని చూశాను. ఉత్తర భారతంలో వేలకొలది శక్తివంతులైన క్షత్రియులు పరిపాలిస్తున్నారు. వారిలో సామర్ధ్యముంది. కాని ధర్మాన్ని రక్షించాలనే తీవ్రమైన కోరిక ఒక్కరిలో కూడా కన్పించలేదు. అందరూ కూడా ఢిల్లీ బాదుషా యెదుట కుక్కల్లా పడివున్నారు. నీలో నాకు ధర్మ రక్షకుడైన మహాపురుషుడు కన్పిస్తున్నాడు. నీలో శక్తి యుక్తులు రెండూ వున్నాయి. మనమంతా కలసి ధర్మ సంస్థాపకులమనే పేరుగడించాలి".. ఈ ఉత్తరం చూడగానే శివాజీకి ఉత్కంఠ పెరిగి రామదాసును చేరాడు.


ఈ విధంగా ఇద్దరు చారిత్రక పురుషుల సమ్మేళనం జరిగింది. శ్రీ సమర్థ రామదాసు శివాజీ కలిసి చర్చించి, అలోచించుకున్న తర్వాతనే ముందడుగు పడేది. 

 

ఆశ్చర్యమేమిటంటే, పసితనం లోనే యిల్లు వదలి పెట్టిన రామదాసస్వామికి వంట నుండి రాజకీయాల వరకు తెలియని విషయమంటూ లేదు. కుటుంబ నిర్వహణ గురించి ఆయన అనేక మందికి సలహాలిచ్చాడు.

 

జగద్గురు శ్రీమత్ శంకరాచార్య తర్వాత ధర్మ సంరక్షణార్ధము సంపూర్ణ దేశ పర్యటన చేసింది యీ మహాత్ముడే !

సమర్థ రామదాసస్వామి సామాన్య ప్రజానీకంలో చైతన్యాన్ని కల్గించగల వున్నతమైన నాయకుడు. విదర్మీయుల పాలనలో హిందువులు అనేక అగచాట్లు పడుండేవారు. ఈ స్థితి భక్తి మార్గాన్ని ఆశ్రయించటం వలన తొలగదు, వందలకొలది యేళ్ళు పరాయి పరిపాలన కారణంగా జాతి నడుము విరిగి పోయింది. జాతి ఆత్మసైర్యాన్ని కోల్పోయింది . ప్రజా సంఘటన, ధర్మ సంస్థాపన చెయ్యాలనే సంకల్పంతోనే రామదాసస్వామి తీర్థయాత్రలు చేస్తూ మఠాల్ని స్థాపించాడు. పని ప్రారంభించాడు. ప్రజల్లో స్వరాజ్య కాంక్ష రేకెత్తించి, రాజనీతిలో తన సాంప్రదాయ లక్షణాల్ని జోడించాడు. “ప్రపంచంలో కొనసాగేటప్పుడు రాజకీయాలు, లౌకిక వ్యవహారాలతో సంబంధం లేకుండా పారమార్థికత సిద్దించద"ని రామదాసు చెప్పాడు.

సమర్థరామదాసు, ఛత్రపతి శివాజీల చివరి కలయిక శకసంవత్సరం 1601 లో పుష్య శుద్ధ నవమినాడు సజ్జర్లో జరిగింది. ఆయన రాజుకు రాజ్యవ్యవస్థను గూర్చి భోదించాడు. తర్వాత రెండు నెలలకు శక సంవత్సరం 1602 లో చైత్రపూర్ణిమనాడు శివాజీ మహారాజు మరణించాడు. స్వరాజ్య సాపనకోసం 35 సంవత్సరాలు రాత్రింబవళ్ళు శ్రమించిన శివాజీ మహారాజు రాయగడ్తో తన జీవన యాత్రను ముగించాడు.

ఈ విషయం తెలియగానే సమర్దరామదాసు తన గదిలోకి వెళ్ళిపోయాడు. అన్నం తినటం మానేసి, కేవలం పాలు మాత్రమే తీసుకునేవాడు. బయటకు రావటం మానివేశాడు.

Essay on Samartha Ramadas in Telugu | Telugu Essays for Telugu Project for School Students | Telugu Projects for School Students | Telugu Essays | Telugu Project Works | Short Stories for Kids | Short Stories in Telugu | Short Stories | Life History in Telugu | Biography in Telugu

శివాజీ కుమారుడైన శంభాజీ మహారాజుకు రాజకీయ పరమైన పెద్ద వుత్తరం వ్రాసి పంపించాడు. సమర్ద రామదాసు ఆరోగ్యం క్షీణించసాగింది. శివాజీ మహారాజు మరణించాక ఆయన ఎక్కువకాలం జీవించడనేది జగద్విదితమే! మాఘ కృష్ణనవమి శని వారంనాడు శ్రీరామ చంద్రుని ప్రతిమకు ఎదురుగా కూర్చుని సమాధి చెందారు.

Swami Ramadas Biography in Telugu | Samartha Ramadas Biography in Telugu | Sant Ramadas Biography in Telugu | Sant Ramdas Life Story in Telugu | Samartha Ramadas Life Story in Telugu | Sant Ramadas Life Story in Telugu |  Samartha Ramadas | సమర్థ రామదాసు | సమర్థ రామదాసు జీవిత చరిత్ర |శివాజీ గురువు | Samartha Ramadas | Viswa Guru Bharath | విశ్వ గురు భారత్

 ఓం శాంతి.

Post a Comment

0 Comments