తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా
సాగరమే ఘాల చుట్టుకుని
సురగంగ చీరగా మలచుకుని
గీతాగానం పాడుకుని
మన దేవికి ఇవ్వాలి హారతులు
గాఁగ జటాధర భావనతో
హిమశైల శిఖరమే నిలబడగా
గల గల పారే నదులన్నీ
ఒక బృందగానమే చేస్తుంటే
ఎందరో వీరుల త్యాగ ఫలం
మన నేటి స్వేచ్ఛకే మూలబలం
వారందరిని తలచుకుని
మన మానసవీధిని నిలుపుకుని
తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా
ఈ పాట రచయిత కోసం చాలా వెతికాము. దొరకలేదు.
మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి.
- విశ్వ గురు భారత్
1 Comments
ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ
ReplyDelete