రచన - అప్పాల ప్రసాద్ గారు
సంగీతం, గానం - రాజా
నీవూ నేనూ వారూ వీరూ - అంతా కలిసి మనమొకటే
కొలిచే దేవతలెందరు వున్నా- తల్లి భారతి మనకొకటే
కులాలు వర్గాలెన్నున్నా, భాషలు యాసలు ఎన్నున్నా
పై పై భేదాలెన్నున్నా - మనలో ఏకత్వం ఒకటే!!
1. రాముడు, కృష్ణుడు, రాణా, శివాజీ - ఆదర్శాలు మనకొకటే
సుఖ దుఖాలు, శత్రు మిత్రులు - గెలుపోటములు మనకొకటే
విజయ గాథల చరితొకటే -జీవన పద్దతి మనకొకటే
మనసా, వాచా, క్రియారూపమున - దేశభక్తి లో మనమొకటే!!
2.మట్టిని, చెట్టును, నీటిని, గోవును - తల్లిగ చూసే చూపెకటే
పూరీ, ద్వారిక, శబరిమలై ,కేదార్ నాథ్ ల పూజొకటే
శ్రద్దాభక్తులు మనకొకటే - శ్రేష్ట పరంపర మనకొకటె
యుగ యుగాలుగా తరగని చెరగని భారత సంస్కృతి మనదొకటే
3.ఈ జగమంతా కుటుంబమే యను విశాల హృదయం మనదొకటే
ప్రపంచ ప్రజల శాంతిని కోరే జీవన ధ్యేయం మనకొకటే
స్పందన, సంవేదన లొకటే
ఆశయ ఆకాంక్షలు ఒకటే
దేశ మాతను జగద్గురువుగా నిలిపే లక్ష్యం మనకొకటే!!
2 Comments
Wonderful song
ReplyDeleteSuppppppppppeeeeeeeeerrrrrrr
DeleteSong