Breaking News

6/recent/ticker-posts

ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర - Chathrapati Shivaji Life Story in Telugu (Part 3)




విలాసాలకు సమయం లేదు
శివాజీ 36 సంవత్సరాల ప్రజా జీవనం లో యుద్దం చేసింది 6 సంవత్సారాలే. మిగతా 30 సంవత్సరాలు ఉత్తమ పరిపాలన వ్యవస్థ గురించి పని చేశాడు.
సకల రాజ్య వైభొగాలున్న రాజ ప్రాసాదం లో ప్రాపంచిక సుఖాలకు,వినోద విహారాలకు ప్ర్రాధాన్యత ఇవ్వక, కర్మ యోగి గా జీవించాడు.

మావళీ,కోలీ,భండారీలే శివుని సైన్యంతల్లి జీజా,కుల గురువు దాదాజీ ఖండ దేవ్,తండ్రి షాజీ ల నుండి అబ్బిన స్వరాజ్య భావన మావళీ లకు,కొంకణ ప్రాంతంలోని కోలీలకు,రాష్ట్రమంతటా విస్తరించి వున్న భండారిలకు వివరించటం అంత సులభం కాదు.అయినా వాళ్ళల్లో ఒక్కడిగా జీవించి అర్థం చేయించారు.
ఆధ్యాత్మిక గురువులు భక్త తుకారాం,సమర్థ రామదాసు స్వామిలు శివాజీకి జీవన పరమార్థం అందించి, క్షాత్ర ధర్మాన్ని బోధించి ముందుకు నడిపారు.

శత్రువుల తో కూట నీతిముస్లిం పాలకుల్లో బిజాపూర్ ఆదిల్షాలు,గోల్కొండ కుతుబ్ షాహీలు హిందువుల నుండి మతం మారిన ముస్లిం లైతే,ఢిల్లీ ని ఏలుతున్న మొఘలులు, పఠానులు, టర్కీలు విదేశాల నుంచి వచ్చినవారు కాగా, శివాజీ ముందుగా మొఘలుల పాలన అంతం చేయడానికి బిజాపూర్,గోల్కొండ నవాబుల సహాయం తీసుకుని నేర్పుతొ ఔరంగజేబుని తాను బ్రతికినంతకాలం తన దరి దాపుల్లొకి కూడా రానివ్వక, విదేశీ పాలనను భూస్థాపితం చేయ కంకణం కట్టుకుని శ్రమించిన వాడు ఛత్రపతి.

ఆంగ్లేయులనే భయపెట్టిన శివాజీశివాజీ ఇంకో 5,6 ఏళ్లు బ్రతికి ఉంటే ఇంగ్లిషు వాళ్లు ఇక్కడ రాజ్యం చేయలేక పోయేవారు.
మొఘలుల వ్యుహాలను తుత్తునియలు చేసిన శివాజీని చూసిన అప్పటి బ్రిటిష్ మిలిట్రీ సెక్రెటరీ ఫిలిప్ పై విధంగా తన డైరీలో వ్రాసుకున్నాడు.
శివాజీ సముద్ర యుద్దాలు చేయటంలో నిపుణుడు కాకపోవటం మన అదృష్టం. లేకపోతే నేల పైన చేసిన విధ్వంసం వలెనే సముద్రాలను కూడా చుట్టబెట్టేవాడు' అని జేమ్స్ డగలస్ పేర్కొన్నారు.
అయితే శివాజీ ఇంగ్లిషు ఫ్రెంచ్ పోర్చుగీసు భారీ నౌకలకు కి దీటుగా చిన చిన నౌకలను తయారు చేసి ఇరుకైన సందులు జలమార్గాల్లొకి వెళ్ల గలిగెటట్లు ఉపయొగించాడు.
లక్ష విదేశీ సైన్యం × 6 వేలు శివ సైన్యం
35 వేల సైన్యంతో వచ్చిన బిజాపూర్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్ ని ఎదుర్కోవటం లో తన సైన్యంలో మానసికంగా బలాన్ని నిర్మాణం చేశాడు. 'మీ కత్తులలో నేను నివసిస్తాను' అని భవాని మాత అన్నట్లు పదే పదే ధైర్యాన్ని కలిగించాడు.
మొఘల్ సేనాని షాహిస్తా ఖాన్ లక్ష సైన్యంతో పూణె మీద దాడి చేస్తే, పారిపొయి కొద్ది రోజుల తరువాత విలాసాలలో మునిగివున్న ఆ ఖాన్ వున్న గదిలోకి శివాజీ ఒక్కడే ప్రవేశించి,చేతి వ్రేళ్ళు నరికి,లక్ష మంది సైనికుల మనోబలం మీద దెబ్బకొట్టి,కోటను స్వాధీనం చేసుకున్నాడు.

గుర్రాల పోషణవేగంగా పరుగులెత్తగల,వెంటనె సందేశం పంపగల అరబ్బు గుర్రాలను తెప్పించి,సంతాన అభివృద్ది కి కేంద్రాలు తెరిచి,తాను మరణించే నాటికి 50వేల గుర్రాలు అయ్యేట్లు చూసాడు.

స్వదేశీ భావనస్థానిక ఉత్పత్తి దారుల వస్తువులకు రక్షణ కల్పించి,విదేశీ మార్కెటుపై నిఘా ఉంచేవాడు. ఒకసారి పోర్చుగీసు వ్యాపారులు మార్కెట్లలో తాము తయారుచేసి ఉప్పును తెచ్చి తక్కువ ధరకు అమ్ముతున్న ఉప్పు మీద శివాజీ దిగుమతి సుంకం విధించాడు.

స్వదేశీ సాంకేతికతమందుగుండు సామగ్రి తయారీ విశయం ఆంగ్లేయుల నుండి సహకారం లభించలేదు. వెంటనె ఫ్రాన్స్ సహకారం తో పురంధర లో మందుగుండు , పిరంగి గుళ్ల పరిశ్రమ స్థాపించాడు. తన జీవిత చరమాంకంలో ఖజనాలొ వున్న మొత్తం 9 కోట్ల రూపాయలు.

ఆదర్శ పాలనమొదటి దండయాత్రలో 6 నెలలు,రెండవ సారి దండయాత్ర లో 2 ఏళ్లు రాజ్యానికి దూరంగా వున్నప్పటికిని,సిపాయి నుండి ప్రధాన మంత్రి వరకు తమ బాధ్యతలను నిబద్దత తో,సమర్థవంతంగా నిర్వహించే ఆదర్శ పాలనా వ్యవస్థను నిర్మించింది శివాజీయే.
అఫ్జల్ ఖాన్ తో యుద్దానికి వెల్టున్నప్పుడు కూడా కాషాయ ధ్వజం ఇలాగే ఎగరాలి.అనుకొకుండా ఏదైనా జరిగితే నా రెండున్నర ఏళ్ల సంబాజీ ని గద్దె మీద కుర్చొపెట్టి,నేతాజీ ఫాల్కర్ నాయకత్వంలో స్వరాజ్య సమరం కొనసాగించాలని శివాజీ సూచిస్తాడు.
జాగిర్ల వ్యవస్థ ను తగ్గించాడు. భుసారాన్ని కాపాడేందుకు, ఆరోగ్యకరమైన పంట విధానం కోసం పంట మార్పిడి పద్దతిని ప్రొత్సహించాడు.
9 మంది శత్రువులను గుర్తించి వారు పన్నిన పద్మ వ్యూహాన్ని చెధించిన శివాజీ. మొఘలులు, ఆదిల్ షాలు, కుతుబ్ షాహిలు, బ్రిటిషర్లు, పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, సిద్ది జోహార్లు మరియు అంతర్గత శత్రువులు( నమ్మక ద్రోహులు కొందరు రాజపుత్ర,మరాఠాలు )ఇలా వీరంతా చెస్తున్న దాడుల నుండి సమయొచితంగా వ్యవహరించి విజయ పథాన నడిచాడు.

నౌకలు - నాణాలు - స్వభాషసముద్రాల ద్వారా ఆసియా నుండి పశ్చిమాసియా దేశాల వరకు వాణిజ్యం కొనసాగించి, వచ్చిన ఆదాయంతో నౌకా దళాలు నిర్మించారు.
శివాజీ కాలంలో అమలులో వున్న హొణ్ అను నాణాలను ముద్రించే పనిని , బ్రిటిషు వారుఅడిగినప్పటికి వారికివ్వక స్వయం ముద్రణ చేపట్టారు. సంపాదించిన డబ్బును విలాసాలకు ఉపయోగించక, సముద్ర దుర్గాల నిర్మాణానికి ఖర్చు చేశారు.
పారశీ భాష బదులుగా 1400 సంస్కృతంతో కూడిన మరాఠీ పదాలతో ఒక నిఘంటువును రూపొందించారు.
తన పరిపాలన కాలంలో ఎవరి ఆరాధనా పద్దతులకు భంగం కలిగించక,అలాగే మూఢాచారాలు నిర్మూలించి,అన్ని కులాల వారిని సమదృష్టి తో చూసి అందరినీ గుర్తించి,గౌరవించి, ఆదరించి,సన్మానించే సమరస జీవనం కొనసాగించాడు.




అష్ట ప్రధానులు1674 నాటికే అష్ట ప్రధానుల వ్యవస్థ ను ఏర్పాటు చేసి వారి వారి బాధ్యతలను నిర్వచించి సురాజ్య - సుపరిపాలనను అందించిన ఛత్రపతి శివాజీ దివ్య సూత్రాలు స్వదేశం,స్వధర్మం,స్వరాజ్యం లను మన హృదయాల్లో నింపుకుని నిరంతరం సమాజాన్ని జాగృతం చేస్తేనే మన దేశం మళ్ళీ స్వాతంత్ర్యం కొల్పొకుండా కాపాడుకోగలం.




శ్రీ అప్పాల ప్రసాద్

(రచయిత - తెలంగాణ కన్వీనర్, సామాజిక సమరసతా వేదిక)





Post a Comment

0 Comments