Breaking News

6/recent/ticker-posts

ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర - Chatrapathi Shivaji Life Story in Telugu (Part 2)




నేటి సర్పంచులు, ఎంపిటిసి, జెడ్పిటిసి, ఎం.ఎల్.ఏలు మొదలుకుని మంత్రి,ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి వరకు అన్ని స్థాయిల్లోని వారికి వచ్చే పరీక్షల్లో అడుగడుగునా శివాజీయే ఆదర్శంగా నిలుస్తాడు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలను పరిపాలన లో భాగస్వాములుగా సమాజానికి కొత్త దిశను ప్రసాదించిన సుపరిపాలకుడు ఛత్రపతి శివాజీ.విదేశీయ మొఘలుల ,పఠానులల ఆధిపత్యం నుండి మాతృభూమిని విముక్తం చేయడానికి 16 ఏళ్ల వయసులో సంకల్పం తీసుకుని మొదట తోరణ,తరువాత కల్యాణ దుర్గాలను గెలిచి, కొద్ది కాలంలోనే 300 పైగా కొటలను స్వాధీనం చేసుకుని హైందవీ సామ్రాజ్యానికి బలమైన పునాదులు వేసిన సంఘటనా దక్షుడు శివాజీ.

కష్టాలు,కడగండ్లు,సవాళ్ల తో కూడుకున్న లక్ష్యాన్ని,తన సామర్థ్యంతో అడ్డంకులు అధిగమించి అందుకున్న కుశల చక్రవర్తి.
పరిపాలించటమె కాదు,మంచి పరిపాలన అందించటమెలా? ప్రజల సమగ్ర అభివృద్దిలొనె పాలకుడి కౌశల్యం దాగి వుంటుందని ఆర్య చాణక్యుడు. అందుకే రాజ్యంలొని వనరులన్ని ప్రజలకు అర్పించి,ప్రజా నేత గా పేరు గడించాడు. 'ప్రపంచంలో మహా యోధులు అలెగ్జాండర్ మరియు జులియస్ సీజర్ తో సరిదూగ గలవాడు శివాజీ 'అంటూ పోర్చుగీసు వైస్రాయి కారల్ డి సెయింట్ విన్సెంట్ అంటారు.
'దేశ ప్రజలను బంగారు భవిష్యత్ దిశగా నడిపేందుకు ప్రేరణ నిచ్చి,వారిలో స్వాతంత్య్ర సమరం రగిల్చినందువల్లనే మొఘల్ సామ్రాజ్యం అంతరించింది" అంటూ గ్రాంట్ డ్రఫ్ అంటాడు.
"మొఘల్ సామ్రాజ్యానికి ప్రమాదం వాటిల్లితే,అది శివాజీ వల్లనే రావచ్చునని ఔరంగజేబు కి ఉత్తరం వ్రాసి,హెచ్చరించాడు అలనాటి పర్షియా పాలకుడు రెండవ షా అబ్బాస్.
శత్రువులకు అంతు చిక్కని వ్యక్తి, అనుచరులకు,సహచరులకు మాత్రం ఆశా కిరణం., మార్పుకు,ప్రగతికి సోపాన మార్గం ఛత్రపతి శివాజీ. పదవి లభించగానే ఆశ్రిత పక్షపాతం,అవినీతికి పట్టం కట్టె నాయకులు కనిపించే స్థితిలో గెలిచిన 300 కొటల్లొ ఏ ఒక్క కోటకు తన బంధువు ని నియమించలేదు శివాజీ.కుటుంబ సభ్యుల ఆధిపత్యానికి అవకాశం ఇవ్వలేదు. ఒక పెద్ద కుటుంబాన్ని నడుపుతున్నట్లుగా భావించి, స్వావలంబన, అజేయత్వం అంటే ఎటువంటిదో చూపించిన వాడు శివాజీ. సామాన్య ప్రజలు,సామాన్య యువకుల ద్వారా అసాధారణ రీతిలో పనులు చేయించి,నమ్మిన వారికోసం నిలబడి,వారిని గుర్తించి,గౌరవించి,ఆదరించిన సహృదయ శీలి శివాజీ. నేటి సర్పంచులు, ఎంపిటిసి,జెడ్పిటిసి,ఎం ఎల్ ఏ లు మొదలుకుని మంత్రి,ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి,రాష్ట్రపతి వరకు అన్ని స్థాయిల్లోని వారికి వచ్చే పరీక్షల్లో అడుగడుగునా శివాజీయే ఆదర్శంగా నిలుస్తాడు.
తొలి దశలో శివాజీకి వారసత్వం గా వచ్చిన పుణే వద్దగల 36 గ్రామాలు మాత్రమే. ఆ పరిసర ప్రాంతాల్లో నివసించే మావళీలతో స్నేహం చేసి స్వాతంత్య్ర పోరాటంలో భాగస్థులుగా స్వరాజ్య భావనతో ఒక మహా సామ్రాజ్యం నెలకొల్పిన ఘనత శివాజీది.
శివాజీ 36 సంవత్సరాల ప్రజా జీవనం లో యుద్దం చేసింది 6 సంవత్సారాలే. మిగతా 30 సంవత్సరాలు ఉత్తమ పరిపాలన వ్యవస్థ గురించి పని చేశాడు.
సకల రాజ్య వైభొగాలున్న రాజ ప్రాసాదం లో ప్రాపంచిక సుఖాలకు,వినోద విహారాలకు ప్ర్రాధాన్యత ఇవ్వక, కర్మ యోగి గా జీవించాడు. తల్లి జీజా,కుల గురువు దాదాజీ ఖండ దేవ్,తండ్రి షాజీ ల నుండి అబ్బిన స్వరాజ్య భావన మావళీ లకు,కొంకణ ప్రాంతంలోని కోలీలకు,రాష్ట్రమంతటా విస్తరించి వున్న భండారిలకు వివరించటం అంత సులభం కాదు.అయినా వాళ్ళల్లో ఒక్కడిగా జీవించి అర్థం చేయించారు.

ఆధ్యాత్మిక గురువులు భక్త తుకారాం,సమర్థ రామదాసు స్వామిలు శివాజీకి జీవన పరమార్థం అందించి, క్షాత్ర ధర్మాన్ని బోధించి ముందుకు నడిపారు. ముస్లిం పాలకుల్లో బిజాపూర్ ఆదిల్షాలు,గోల్కొండ కుతుబ్ షాహీలు హిందువుల నుండి మతం మారిన ముస్లిం లైతే, ఢిల్లీ ని ఏలుతున్నమొఘలులు, పఠానులు, టర్కీలు విదేశాల నుంచి వచ్చినవారు కాగా, శివాజీ ముందుగా మొఘలుల పాలన అంతం చేయడానికి బిజాపూర్, గోల్కొండ నవాబుల సహాయం తీసుకుని నేర్పుతొ ఔరంగజేబుని తాను బ్రతికినంతకాలం తన దరి దాపుల్లొకి కూడా రానివ్వక, విదేశీ పాలనను భూస్థాపితం చేయ కంకణం కట్టుకుని శ్రమించిన వాడు ఛత్రపతి.




శ్రీ అప్పాల ప్రసాద్

(రచయిత - తెలంగాణ కన్వీనర్, సామాజిక సమరసతా వేదిక)






Post a Comment

0 Comments